శఫరి

అంగీకారం

Citation
, XML
Authors
 

అంగీకారం 

 

         తెలుగు పరీక్షలు అనగానే భయం నాకు చిన్నప్పుడు. తెలుగులో “అంచు దాటు గుర్తు” వరకే వచ్చేవి నాకు సంఖ్యలు పరీక్షల్లో. నా చేవ్రాత చూసి విసుక్కునేడు వాడు చిన్నప్పుడు మా తెలుగు మాస్టారు పురాణం సుబ్బా రావు గారు.  

           తెలుగులో వ్రాయడం అలవాటు తప్పింది ఈమధ్య.  ఈ నేపధ్యం లో తెలుగు కవితలు రాద్దామని అనుకోవడం సాహసమే. నేను స్వతహాగా సాహసం కలవాడిని. గూగుల్ వారి ట్రాన్స్ లిటేరేషన్  ఉపయోగించా! హుర్రే !!

       తరువాత, పరవస్తు చిన్నయ సూరి గారి బాల వ్యాకరణం లో  ఆఖరి సూత్రం (23), ఆర్య వ్యవహరంబుల దృష్టంబు గ్రాహ్యంబు, మీద నా ఆశ, నా నమ్మకం. మీరు కూడా ఆ సూత్రాన్ని మన్నిస్తారని భావిస్తున్నాను. నేను ఈ విషయంలో అంటే తప్పులు చెయ్యడం లో అర్యుడ్నేనని నా నమ్మకం. మీకేమైనా తప్పులు కనబడితే పట్టుకోకండి దిద్దుకొని చదవండి “ప్లీజ్”. అంత సహృదయం మీకుంది, నాకు తెలుసు. మరో చిన్న విన్నపం, సారా త్రాగకండి దయచేసి. మీ ఆరోగ్యానికి, సంసారానికి మంచిది కాదు. లి పో, ఒమర్ ఖయ్యాంలు ఆర్యులు. వాళ్ళ తో పోల్చుకోకండి. నామాట వింటారు కదూ. నా  “గుస్తాఫీ మాఫ్” చెయ్యమని మనవి .

    అది సరేగాని తెలుగు లో సానెట్లు ప్రయత్నించా గమనించమని మన్నవి. నా సంకలనం లో కొన్ని ఇతర భాషల కవితల్ని అనుకరించినవి వున్నాయి. డా. హస్సన్ హేగాజి, జియాద్ సౌదీ, జియాద్ మాజైద్, నేటి, సమకాలీన అరబ్ కవులు, నా స్నేహితులు. లి పో, క్రీ శ 701 762 కాలం నాటి చైనా కవి, మార్మికుడు. లి పో కి చంద్రుడంటే, సారా అంటే ఇష్టం. ఒమర్ ఖయ్యాం (క్రీ శ 1048 – 1131), గణిత, ఖగోళ శాస్త్రములలో అందెవేసిన చెయ్యి, పర్షియా దేశస్తుడు.

 నా సహచరిణి ఇందూ ఒర్పు, ఓదార్పు నాకు రక్ష. ఇన్దూ ని గమనిస్తే మాక్సిం గోర్కీ కథ లో “అమ్మ” గుర్తొస్తుంది నాకు. నేనేమి వ్రాసినా ఇష్టపడుతుంది. నే వ్రాసిన మాటలు నా మనో సంతతి, కనుక ఎలాంటి ప్రయోజనాన్ని ఆశించడం లేదు. కాకి పిల్ల కాకికి ముద్దు ప్రయోజనం వున్నా లేకున్నా.

 

 

ప్రేమతో,

మిత్రుడు,

రత్న శేఖర్ 
 
 
 

అంకితం

 

 
                 జీవితం లో రకరకాల వ్యక్తులు మనకు తారస పడతారు. వాళ్ళలో కొందరు నేస్తాలు ఔతారు, మన భావనల్ని పంచుకుంటారు,మన్నిస్తారు. మన శ్రేయస్సు కోరుకుంటారు. మన నేస్తాల్లో కొందరు ప్రాణ స్నేహితులు ఔతారు. ప్రాణ స్నేహితులు మనల్నుంచి ఏమిఆశించరు. మనకు ఏదైనా నైపుణ్యము నేర్పిన ప్ర్రాణ స్నేహితులు ఐతే వాళ్ళు మన గురువులు అవుతారు. నేస్తాల విషయం లో నేను అదృష్టవంతుణ్ణి. నిజం చెప్పాలంటే నా గురువుగార్లవలనే నా జీవన ప్రగతి. ఎంతమంది నా జీవన ప్రగతిని నిర్దేసిన్చారో చుస్తే నా కిప్పుడు ఆశ్చర్యం వేస్తుంది. వాళ్ళు నన్ను కుల, మత, భాష, ప్రాంతీయ విభేదం లేకుండా ఆసిర్వదించారు. నా ప్రాణ స్నేహితుల్లో ఐదుగురు ఇప్పుడు లేరు.
 
శ్రీ పి. వి. రెడ్డి గారు ఆంధ్ర విశ్వవిద్యాలయం లో విద్యార్ధి రాజకీయాల్లో నా గురువు గారు. ఆయన కాలేజీ అఫ్ సైన్సు అండ్ టెక్నాలజీ స్టూడెంట్స్ యునియెన్ సేక్రటరీ గా చేసేరు. ఆంధ్ర విశ్వవిద్యాలయం మూడు కాలేజీలలో ఆయన ప్రభావం వుండేది. రెడ్డి గారి ఆశిస్సులతో1973 -74 సంవస్త్సరంలో నేను ఇంజనీరింగ్ కాలేజీ సెక్రటరీ గా గెలిచి అందర్ని ఆశ్చర్యం లో ముంచేము. ఆతరువాత జరిగింది …………………………………… అదే సంవస్త్సరం మన్మధ రావు ఆర్ట్స్, కామర్స్అండ్ లా కాలేజీ జాయింట్ సెక్రటరీ గా గెలిచేడు. అంతకు మునుపు తను ఏ. వి. యన్.కాలేజీ ప్రెసిడెంట్ గా చేసేరు. మన్మద్ ని మనూ అని పిలిచే వాడ్ని. శ్రీ పి. వి.రెడ్డి గారు, మనూ నాప్రాణ స్నేహితులు. వారికి మనస్పూర్తిగా నా శఫరి ని అంకితమిస్తున్నా. రెడ్డి గారు, మను ఇప్పుడు భౌతిక ప్రపంచం లో లేరు అయినా వాళ్ళ ప్రభావం నాలో ఇమిడివుంది.
 

 
 
డి యమ్ ఆర్ శేఖర్  

 

 1. Aryanism: Arya Dharma
 2. Hindu in the Contemporary India
 3. Life, Consciousness and Evolution
 4. Bhil Nadu
 5. Engineering Education
 6. Unbound Intelligence – Review
 7. Laws of Biology
 8. Genopsych : collection
 9. Libet’s puzzle
 10. Survival strategies of living systems
 11. New Ideas
 12. घंटाघर
 13. चांदनी रात
 14. Colosseum
 15. ఇప్పుడు కాదండీ
 16. కాల భైరవం
 17. ద్రోహి
 18. चांदनी रात
 19. Colosseum
 20. चंगुल
 21. పరోక్షం
 22. India
 23. Temples of Sand
 24. సమయం
 25. కవితలు
 26. లోకం పోకడ
 27. శఫరి
 28. బానిసత్వం
 29. ఆలోచన
 30. గొంగళి
 31. సామి
 32. కాల భైరవం
 33. రాజకీయం
 34. స్వేఛ్చ కోసం
 35. గోగు పూలు
 36. పరిశోధన
 37. వైరం
 38. గాంధీ గారు
 39. Blind faith in old science
 40. వాస్తవం
 41. ఆనాటి శఫరి
 42. ప్రయాణం
 43. వైనం
 44. Conscious systems and the third law of biology
 45. గుగ్గిళ్ళు
 46. Sir JC Bose and the second law of biology
 47. Entropy and its dual nature
 48. Living Systems
 49. మాయం
 50. ఎడారి మయూరి
 51. మేఘ నిరసన
 52. రాగ రాగిణి
 53. వెబ్ లో తెలుగు సినిమా పాటలు
 54. పెద్దల మాట
 55. ఉలుకు పలుకు
 56. పునరాలోచన
 57. Reality of the Self
 58. నా కధ
 59. అనివార్యం
 60. ఒకనాటి కల
 61. మార్పు
 62. శేష దుష్ప్రభావం
 63. ఆటవికులు
 64. మట్టి దిండు
 65. వేకువ ఝామున
 66. శక్తి
 67. సమీక్ష
 68. లెక్కలు
 69. వెన్నెట్లో పూల పందిట్లో
 70. నిశ్చయమైన విషయం
 71. అధ్భుతమైన స్వప్నం
 72. నిన్నటి అందం
 73. Eddington’s Psycho-Syndrome
 74. అగ్ని ప్రక్షాళన
 75. వెర్రి వాడు
 76. వాన
 77. వర్షం
 78. తెల్లవారని తెలివి
 79. యశస్వి
 80. సునామీ
 81. యాక్ ఛి
 82. చింతన
 83. మర్దిన్చవే నా చెల్లీ
 84. హిందోళ
 85. స్వర్గం
 86. గుప్త చిత్రం
 87. దేవుడు లేని దగ్గర
 88. ఎడారి
 89. మహా మార్గం
 90. నేను, పర్వతం
 91. గోడు
 92. సన్న్ద్ది
 93. వెయ్యి దివ్వెలు
 94. అరణ్య రాజ్యం
 95. తీరని కోర్క
 96. భారతి
 97. వెన్నెట్లో దిగులు
 98. కాకి గోల
 99. విశ్వరూపం
 100. సింగూరు
 101. ఒప్పుకుంది
 102. ప్రియురాలి అందం
 103. శివరంజని
 104. కవితా వేదన
 105. దుమారం
 106. గావు కేకలు
 107. తాళం లేని ద్వారం
 108. అంతంలేని చోటు
 109. మృత సముద్రం
 110. కల్లుకుండ
 111. ఈత చెట్టు
 112. నేస్తాలు
 113. తను
 114. శఫరి
 115. The paradox of life
 116. Castes in the Court
 117. Genopsych
 118. The properties of living systems
 119. Plants and human health
 120. Evolution of Human Societies
 121. Sindollu
 122. Seetha Katha
 123. Venter builds Wald’s machine
 124. The primacy of DNA as a unit of life
 125. The drive and the direction of evolution
 126. Aryan, Arya and Ayyanar
 127. Capacitor like electronic structures of DNA
 128. Thorleif Wathne
 129. Random Birds
 130. Phosphates in agriculture
 131. Poturaju