Abstract
మార్పు అనివార్యం. స్తిరమైనది విశ్వంలో మార్పు ఒక్కటే గౌతముడు చెప్పినట్టు.
అనివార్యం
పలుకవేం రష్యా మాటాడవేం
అలిగేవా రష్యా అలసి పోయేవా
నీ బిడ్డలే నిను అమ్మేశారని
చింపేశారని చంపేశారని
నువ్వుంటే వచ్చేది కాదు యుద్ధం
మిగిలేవాడు పాపం సద్దాం
సామాన్యులం సగటు మనుషులం
ఐనా మేమే నీ అసలైన బలం
నిలబడు రష్యా కలబడు రష్యా
స్వయంసంధిత మహా కాళివై
శివుడ్నడిగి త్రిశూల ధారివై
ముందూ వెనుక నిలబడతాం
గర్జిస్తాం దుష్టుల్ని మర్దిస్తాం
వసుధైక కుటుంబాన్ని నిర్మిస్తాం
——— రత్న శేఖర్