Abstract
Tsunami
సునామీ
మలయ మారుత ప్రచండ రూపం
శరధి చేసిన శివ తాండవం
వేల శతహ్రదల అనర్ఘ ప్రహారం
ప్రకృతి కంపనాల తీవ్ర ప్రకోపం
పాతాళ జనిత మహా విస్పోటం
వెల వెల బోయెను వెన్నెల సైతం
శాంతపడిన సముద్రాన
ఎటు చుస్తే అటు దుఃఖాన
తల్లులు కనబడక పిల్లలు
పిల్లల పోగొట్టుకున్న తల్లులు
సమయం చేయును వుపచారం
చిగురించటమే జీవన సారం
మహా శక్తి, తల్లి, సునామీ
తరలి మరలి ఇటు రాకు సుమీ
——- రత్న శేఖర్