తెల్లవారని తెలివి
అర్ధం పర్ధం లేని క్షణిక మైన శక్తి కోసం
యుక్తులు కుయుక్తులు యెంత మోసం
హత్యలు యుద్దాలు అబద్దాలు
ప్రజల రక్తం త్రాగే ప్రభుత్వాలు
విర్ర వీగి అధికారం త్రాగి, దోచిన వాళ్ళు
పతనమై, నేడు పతా లేని చిక్కు ముళ్ళు
గత శక్తులు కరిగి మరిగిన మహా ఘటా లేవి ?
ఎప్పుడు తెల్లవారుతుందో మానవుడి తెలివి ?
———– రత్న శేఖర్